![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -704 లో.....దీప, సూరజ్ ఇద్దరు శివన్నారాయణ ఇచ్చిన గడువు లోపల ఫుడ్ వేస్ట్ కాకుండా అలాగే నష్టాలు రాకుండా చేస్తారు. అందులో భాగంగా రెస్టారెంట్ లో లక్కీ డ్రా పెడతారు. దానిలో గెలిచిన వారికి శివన్నారాయణ చేతుల మీదుగా గోల్డ్ కాయిన్ ఇస్తాడు. ఆ తర్వాత దీప చాలా మంచి పని చేసావ్.. దీంతో మన రెస్టారెంట్ కి మంచిపేరు వచ్చిందని దీపని శివన్నారాయణ పొగుడుతాడు. ఇప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చే టైమ్ తాత ఇప్పుడు అంటే ఇలా అయింది.. వర్షకాలంలో ఫుడ్ డెలివరీ చెయ్యలేం కాబట్టి నష్టం వస్తుందని జ్యోత్స్న అంటుంది.
జ్యోత్స్న చెప్పింది కూడా నిజమే ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోండి మీకు చిన్నపార్టీ ఏర్పాటు చేసాను వెళ్ళండి అని శివన్నారాయణ అంటాడు. దీప, సూరజ్ వెళ్ళాక ఇప్పుడే అయిపోలేదు మరదలా.. ఇది ఆరంభం మాత్రమే అని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. బావ ఎందుకు అలా అన్నాడని జ్యోత్స్న ఆలోచిస్తుంటే సూరజ్ తనకి కాఫీ తీసుకొని వెళ్లి పొగరుబోతుదాన కాఫీ తీసుకో లోపల జరిగిన దానికి మైండ్ బ్లాంక్ అయిందా అని అంటాడు. ఏంట్రా నా మాటలు నాకే అప్పజెప్పుతున్నావా అని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు మా నాన్న నిన్ను పొగిడినందుకు.. ఆ జ్యోత్స్న ఎంత కుళ్ళుకున్నదో అని దీపకి కాంచన దిష్టి తీస్తుంది. ఆ తర్వాత కాంచనకి సుమిత్ర ఫోన్ చేసి దీపకి ఇవ్వు కంగ్రాట్స్ చెప్పాలని అంటుంది. సుమిత్ర మాట్లాడుతుండగానే పారిజాతం, జ్యోత్స్న ఫోన్ తీసుకొని మాట్లాడుతారు. అలా అందరు ఒక్కో మాట మాట్లాడతారు.
ఆ తర్వాత సూరజ్ వాకింగ్ చేస్తుంటే జ్యోత్స్న వస్తుంది. నువ్వు నాతో చేతులు కలిపి నాలాగా మంచివాడిగా మారిపొమ్మని సూరజ్ అంటుంటే నువ్వు ఏంట్రా ఫుట్ పాత్ గాడివి.. నేను అయిదు వందల కోట్లకి వారసురాలిని అని జ్యోత్స్న గొప్పగా చెప్తుంది. అది మీ తాతది అని సూరజ్ అంటాడు. నువ్వు కోపంలో కూడా బాగున్నావని సూరజ్ అంటుంటే.. మళ్ళీ మొదలు పెట్టాడని జ్యోత్స్న అక్కడ నుంచి వెళ్తుంది. మరొకవైపు ఆ ఆర్డర్ ఇచ్చిన వాడిపై కేసు పెట్టండి ఇదంతా జ్యోత్స్న పని అయి ఉంటుందని కార్తీక్, దీపలతో కాంచన అంటుంది. నాకు వచ్చిన డౌట్ అమ్మకి వచ్చింది.. జ్యోత్స్నని ఎంతరెచ్చగొట్టినా భయటపడలేదు. మరి ఎవరు ఇదంతా చేసి ఉంటారని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |